పుష్ప2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడంపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. క్రిమినల్ కేసులు నమోదు చేసి, అరెస్టు చేయడం సరైనది కాదని వైఎస్ జగన్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిది. అదే సమయంలో దీనిపై @alluarjun తన విచారాన్ని వ్యక్తంచేసి, ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. అయితే ఈ ఘటనకు నేరుగా అతడ్ని…
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 13, 2024
హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిది. అదే సమయంలో దీనిపై అల్లు అర్జున్ తన విచారాన్ని వ్యక్తంచేసి, ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. అయితే ఈ ఘటనకు నేరుగా అతడ్ని బాధ్యుడ్ని చేయడం ఎంతవరకు సమంజసం? తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్‌పై క్రిమినల్ కేసులు బనాయించి, అరెస్టు చేయడం సమ్మతంకాదు. అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను
అని జగన్ ట్వీట్ చేశారు.
నాంపల్లి కోర్టు తీర్పు మేరకు ప్రస్తుతం అల్లు అర్జున్ పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. బన్నీ వేసిన క్వాష్ పిటీషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని అల్లు అర్జున్ తరఫు లాయర్ కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. హైకోర్టు ఎలాంటి తీర్పు వెల్లడిస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.