వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister) వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) తన మాతృమూర్తి (Mother) వైఎస్ విజయమ్మ (Y. S. Vijayamma) కు 69వ పుట్టినరోజు శుభాకాంక్షలు (69th Birthday Greetings) తెలిపారు. శనివారం ఉదయం తల్లి విజయమ్మకు ఫోన్ (Phone) చేసిన వైఎస్ జగన్.. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విజయమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎక్స్(X)లో ట్విట్లు చేస్తూ వైఎస్ విజయమ్మకు విషెస్ తెలుపుతున్నారు.
తల్లి విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (Y. S. Sharmila) సైతం శుభాకాంక్షలు తెలియజేశారు. శుభాకాంక్షలు తెలుపుతూ షర్మిల ట్వీట్ చేశారు. వైఎస్ విజయమ్మ పుట్టిన రోజును వైసీపీ నేతలు కూడా ఘనంగా జరుపుకుంటున్నారు. పలువురు రాజకీయ నేతలు, సన్నిహితులు విజయమ్మకు శుభాకాంక్షలు చెబుతున్నారు.