తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ఏపీ మాజీ సీఎం (Former Andhra Pradesh Chief Minister) వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) పుట్టిన రోజు (Birthday) వేడుకలు (Celebrations) ఘనంగా నిర్వహించారు. బర్త్ డే విషెస్‌తో సోషల్ మీడియా (Social Media) మార్మోగింది. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) భారీ కేక్ కట్ చేసి జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఐదు దశాబ్దాల్లో జరగాల్సిన అభివృద్ధిని వైఎస్ జగన్ కేవలం ఐదేళ్లలోనే చేసి చూపించారు అని అన్నారు. అది యాదృచ్ఛికంగా జరగలేదని, స్పష్టమైన ప్రణాళికలు, విధానాలతోనే సాధ్యమైందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆకాంక్షలను లోతుగా అర్థం చేసుకున్న నేత జగన్ అని, ప్రజల అభివృద్ధినే తన లక్ష్యంగా పెట్టుకుని పాలన సాగించారని తెలిపారు.
జగన్ ప్రతి కుటుంబాన్ని తనదిగా భావించి వారి మేలు కోరుకున్నారని, అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పోరాటాలు చేస్తున్నారని సజ్జల అన్నారు. 2014లో అధికారంలోకి రాలేకపోయినా, నంద్యాల ఉప ఎన్నికల్లో చంద్రబాబు చేసిన కుట్రలను ఛేదించుకుని చివరికి 2019లో ఘన విజయం సాధించామని గుర్తు చేశారు.
మేనిఫెస్టోను (Manifesto) ఖురాన్, బైబిల్, భగవద్గీతతో సమానంగా భావించిన నాయకుడు జగన్ అని పేర్కొన్న సజ్జల, ఐదేళ్ల పాలన తర్వాత ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామా లేదా అని ప్రజలనే అడిగిన అరుదైన నేత జగన్‌మోహన్ రెడ్డి అని కొనియాడారు. ప్రజల్లో ఉండే నాయకుడు కాబట్టే జగన్‌కు అపారమైన ఆదరణ ఉందని, రాబోయే రోజుల్లో వైసీపీ (YSRCP) మళ్లీ అధికారంలోకి (Return to Power) వచ్చి భారీ సీట్లతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.








