ఏఐ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ నిరసన.. కేటీఆర్ రియాక్షన్

ఏఐ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ నిరసన.. కేటీఆర్ రియాక్షన్

ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (AI Impact Summit 2026) వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదికపై యూత్ కాంగ్రెస్ (Youth Congress) సభ్యులు నిరసనకు దిగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ దేశాల ప్రతినిధులు, టెక్నాలజీ దిగ్గజాలు, పెట్టుబడిదారులు పాల్గొన్న ఈ సమ్మిట్‌లో రాజకీయ ప్రదర్శనలు చేయడం భారత్ ప్రతిష్టకు దెబ్బతీసే చర్యగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాస్వామ్యంలో నిరసనలు సహజమైన హక్కే అయినప్పటికీ, అంతర్జాతీయ వేదికలను రాజకీయ రంగస్థలాలుగా మార్చడం సరికాదనే అభిప్రాయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. “దేశ ప్రతిష్ట ముందా? రాజకీయ లాభాలా?” అనే ప్రశ్నలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇంకా ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఇదే సమ్మిట్‌లో తమ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రసంగిస్తున్న సమయంలోనే నిరసన జరగడం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు పార్టీ నేత అంతర్జాతీయ వేదికపై రాష్ట్రాన్ని ప్రాతినిధ్యం వహిస్తుండగా, మరోవైపు అదే పార్టీకి చెందిన యువ నేతలు నిరసన చేపట్టడం అంతర్గత విభేదాలకు సంకేతమా? అనే చర్చ మొదలైంది. ఈ ఘటనతో రాజకీయ వర్గాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు మిన్నంటుతున్నాయి. ఇప్పుడు ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment