ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, యోగా గురువు (Yoga Guru) బాబా శివానంద (Baba Shivananda) (128) ఇక లేరు. వయోభారంతో పాటు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శివానంద వారణాసి (Varanasi)లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు (Passed Away).
1896లో పుట్టిన శివానంద వయసు 128 ఏళ్లు అని ప్రచారం ఉంది. ఆయుర్వేదం, యోగాలో నిష్ణాతుడిగా, సన్యాసిగా జీవితాన్ని గడిపిన ఆయన, శాంతి, సేవా మార్గాల్లో జీవించారు. 2022లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డు (Padma Shri Award)ను ప్రదానం చేయగా, ఈ అవార్డు అందుకున్న అత్యధిక వయస్సు గల వ్యక్తిగా చరిత్రలో నిలిచారు.
బాబా శివానంద మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తన సోషల్ మీడియా ఖాతా ద్వారా సంతాపం ప్రకటించారు. ఆయన జీవితం అందరికీ ఆదర్శంగా నిలిచిందని, ఆయన మరణం దేశానికి పెద్ద లోటని అన్నారు.







