న్యాయం చేయ‌మంటే వేధిస్తారా..? – ల‌క్ష్మి అరెస్టుపై వైసీపీ ట్వీట్‌

న్యాయం చేయ‌మంటే వేధిస్తారా..? - ల‌క్ష్మి అరెస్టుపై వైసీపీ ట్వీట్‌

తిరుప‌తి జ‌న‌సేన పార్టీ ఇన్‌చార్జ్ కిర‌ణ్ రాయ‌ల్ – బాధితురాలు ల‌క్ష్మి ఘ‌ట‌న‌ కీల‌క మలుపు తిరిగింది. ఈ వ్య‌వ‌హారంలో అనూహ్యంగా జైపూర్ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. తిరుప‌తి ప్రెస్ క్ల‌బ్‌లో ల‌క్ష్మి ప్రెస్‌మీట్ అనంత‌రం జైపూర్ పోలీసులు చెక్ బౌన్స్ కేసులో ఆమెను అరెస్టు చేశారు. ఇన్నాళ్లు మౌనంగా ఉండి జైపూర్ పోలీసులు అకస్మాత్తుగా చెక్ బౌన్స్ కేసును తెరపైకి తేవ‌డంతో అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. లక్ష రూపాయలు చెక్ బౌన్స్ కేసులో లావాదేవీలు ఉన్నాయంటూ మీడియా ముందు లక్ష్మి వివ‌రించారు.

తిరుప‌తి ప్రెస్ క్ల‌బ్‌లో మాట్లాడిన కిర‌ణ్ రాయ‌ల్ బాధితురాలు ల‌క్ష్మి, త‌న‌కు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, కూట‌మి ప్ర‌భుత్వం న్యాయం చేయాల‌ని కోరింది. ప్రెస్‌మీట్ ముగిసిన గంట‌ల వ్య‌వ‌ధిలోని ఆమెను జైపూర్ పోలీసులు అరెస్టు చేయ‌డం గ‌మ‌నార్హం. కాగా, తిరుపతిలో జనసేన ఇంఛార్జ్ కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగుతోంద‌ని, పాత చెక్ బౌన్స్ కేసుని తెరపైకి తెచ్చి.. జైపూర్‌ పోలీసులపై ఒత్తిడి తెచ్చి బాధితురాలిని కూట‌మి ప్ర‌భుత్వం అరెస్ట్ చేయించింద‌ని ప్ర‌తిప‌క్ష వైసీపీ ఆరోపిస్తుంది.

గత మూడు రోజులుగా తిరుపతి జనసేన ఇన్‌చార్జ్ కిరణ్ రాయల్ మోసాల్ని మీడియా ముందు బయటపెడుతున్న బాధితురాలు ల‌క్ష్మికి న్యాయం చేయాల్సిందిపోయి ఇలా వేధింపులా అంటూ ట్వీట్‌లో సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, హోంమంత్రి అనితను ట్యాగ్ చేస్తూ త‌న ట్వీట్‌లో ప్ర‌శ్నించింది వైసీపీ.

Join WhatsApp

Join Now

Leave a Comment