సూపర్ సిక్స్ (Super Six)పథకాలపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి చంద్రబాబు(Chandrababu) సంచలన వ్యాఖ్యలు చేశారు. సంపద సృష్టించాకే హామీల అమలు అంటూ సోమవారం నిర్వహించిన ప్రెస్మీట్లో చంద్రబాబు స్పష్టం చేశారు. దీంతో రాష్ట్ర ప్రజల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.
ఈ నేపథ్యంలో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూటమి హామీలను, చంద్రబాబు వ్యాఖ్యలను టార్గెట్ చేస్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు. సంపద సృష్టి లేదు.. సంపెంగ పువ్వూ లేదు. జగన్ మీద తోసేసి, చేతులు పైకి ఎత్తేసాడు. హామీలు గాలికి వదిలేశాడు. గోవిందా …గోవిందా…! అంటూ సీఎం చంద్రబాబు, నారా లోకేశ్‌ను ట్యాగ్ చేస్తూ అంబటి ట్వీట్ చేశారు.