వంశీ కేసులో వైసీపీ సంచ‌ల‌న వీడియో

వంశీ కేసులో వైసీపీ సంచ‌ల‌న వీడియో

వైసీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ కేసులో వైసీపీ సంచ‌ల‌న వీడియో బ‌య‌ట‌పెట్టింది. టీడీపీ ఆఫీస్‌లో డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్‌గా ప‌నిచేస్తున్న స‌త్య‌వ‌ర్థ‌న్‌ను కిడ్నాప్ చేశార‌నే అభియోగంతో ఈనెల 13వ తేదీన వంశీని హైద‌రాబాద్ రాయ‌దుర్గంలోని ఆయ‌న నివాసంలో విజ‌య‌వాడ ప‌ట‌మ‌ట పోలీసులు అరెస్టు చేసి విజ‌య‌వాడ‌కు త‌ర‌లించారు.

కాగా, కిడ్నాప్‌కు గురైన వ్య‌క్తి వంశీ అరెస్టుకు ముందురోజు వైజాగ్‌లో స్వేచ్ఛ‌గా తిరుగుతూ షాపింగ్ చేస్తున్న సంచ‌ల‌న వీడియోని వైసీపీ విడుద‌ల చేసింది. చంద్ర‌బాబు సర్కారు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలతో చట్టాన్ని, న్యాయవ్యవస్థలను అపహాస్యం చేస్తున్న తీరుకు ఈ వీడియో నిలువెత్తు నిదర్శనం అని వైసీపీ మండిప‌డుతోంది.

ఫిబ్రవరి 12న విశాఖపట్నంలోని ఆనందపురం జంక్షన్‌లో ఒక క్లాత్ స్టోర్‌లో స్వేచ్ఛ‌గా షాపింగ్‌ చేసుకుంటున్న సత్యవర్థన్‌ వీడియోలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ‘వీడియోలో బ్లూషర్ట్‌ వేసుకున్న వ్యక్తే సత్యవర్థన్‌. వల్లభనేని వంశీ కిడ్నాప్‌ చేశారంటూ ఏపీ పోలీసులు చెప్తున్న వ్యక్తి ఇతనే’ అని, మరి ఈవీడియోను చూస్తే సత్యవర్థన్‌ కిడ్నాప్‌నకు గురైనట్టుగా ఉందా? అని పోలీసుల‌ను, ప్ర‌భుత్వాన్ని ప్ర‌తిప‌క్ష వైసీపీ ప్ర‌శ్నించింది.

కిడ్నాప్‌చేసి, నిర్బంధించిన వ్యక్తి బయటకు ఎలా వస్తారు? ఇలా స్వేచ్ఛగా షాపింగ్‌ ఎలా చేస్తారు? అని ప్ర‌శ్నించింది. దీని అర్థం పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని, వారి కుటుంబ సభ్యులను భయపెట్టి, బెదిరించి తప్పుడు ఫిర్యాదు తీసుకున్నారని ఈ వీడియో ద్వారా స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంద‌ని వైసీపీ

Join WhatsApp

Join Now

Leave a Comment