ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్ ప్రశ్నపత్రాలు యూట్యూబ్‌లో లీక్ కావడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై ప్రతిపక్ష వైసీపీ తీవ్రంగా తీవ్రంగా స్పందించింది. చంద్రబాబు నాయుడు, టీడీపీపై నేరుగా విమర్శలు చేస్తూ, ట్విట్టర్‌లో వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇదేనా నీ 40 ఏళ్ల అనుభవం అంటూ చంద్రబాబును ప్రశ్నించింది.
40 ఏళ్ల అనుభవమంటూ చెప్పుకునే చంద్రబాబు సర్కారు అర్ధ సంవత్సర పరీక్షలకే లీకేజీని ఆపలేకపోయింది. రేపు పబ్లిక్ పరీక్షలను ఎలా నిర్వహిస్తారు? అని ప్రశ్నించింది వైసీపీ. ఇలాంటి ఘటనలు అవగాహనలేని లోకేష్‌కి విద్యాశాఖ అప్పగించడమే కారణం అని పేర్కొంది. విద్యారంగంలో టీడీపీ వైఫల్యాలు రాష్ట్రం భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.
#Breaking 🚨
— YSR Congress Party (@YSRCParty) December 17, 2024
ఏపీలో టెన్త్ ప్రశ్నాపత్రాలు యూట్యూబ్ లో లీక్..
ఇదేనా @ncbn నీ 40 ఏళ్ల అనుభవం?
అర్ధ సంవత్సర పరీక్షలే లీకేజీ లేకుండా నిర్వహించలేకపోయావ్.. రేపొద్దున పబ్లిక్ పరీక్షలు ఎలా నిర్వహిస్తావ్?
అసమర్థుడైన @naralokesh కి విద్యాశాఖని అప్పగిస్తే ఇలాంటి లీకేజీలే… pic.twitter.com/I2C2Ms8YV7
పశ్నాపత్రాల లీకేజ్ అంశంపై వైసీపీ చేసిన విమర్శలతో రాష్ట్రంలో రాజకీయ వేడి మరింతగా పెరిగింది. విద్యాశాఖలో ఈ లీకేజీ వ్యవహారం ఇంకా వివాదాస్పదంగా మారే అవకాశం ఉంది. కాగా, పేపర్ లీకేజీ అంశంపై విద్యార్థుల తల్లిదండ్రుల సైతం ఆందోళన వ్యక్తం చేశారు.