విజయవాడ జిల్లా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ములాఖత్ అయ్యారు. జైల్‌లో ఉన్న వంశీని పరామర్శించిన వైఎస్ జగన్, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేసు విషయంలో జరిగిన పరిణామాలన్నీ వంశీని అడిగి తెలుసుకున్నారు. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి కేసులో పిటిషనర్ సత్యవర్ధన్‌ను బెదిరించారని ఆరోపణల నేపథ్యంలో పోలీసులు వల్లభనేని వంశీని అరెస్టు చేసిన విషయం తెలిపిందే.
వైఎస్ జగన్ వెంట వంశీ భార్య పంకజశ్రీ జైల్ లోపలికి వెళ్లారు. జగన్ రాక సందర్భంగా జైలు వద్దకు వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ములాఖత్ ముగిశాక బయటకు వచ్చిన వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడనున్నారు.