---Advertisement---

జమిలి ఎన్నికలపై వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు

జమిలి ఎన్నికలపై వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు
---Advertisement---

పులివెందుల పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్.. పార్టీ నేతలు, కార్యకర్తలతో జ‌రిగిన స‌మావేశంలో జ‌మిలి ఎన్నిక‌ల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ‘‘కష్టాలు శాశ్వతం కావు. కష్టాల సమయంలో మన వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దు’’ అంటూ జగన్‌ కీలక సందేశం ఇచ్చారు. 2027 చివరలో జమిలి ఎన్నికలు రావచ్చని, ఆ ఎన్నికల్లో మళ్లీ తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్య‌క్తం చేశారు.

ఈ సంద‌ర్భంగా పార్టీ నేత‌ల‌ను ఉద్దేశించి వైఎస్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. అధికారం కోల్పోయినా, ప్రజల కోసం నిలబడే పోరాటాన్ని ఆపలేదని, కోవిడ్ సమయంలోనూ సంక్షేమ పథకాలను కొనసాగించడం ద్వారా ప్రజల నమ్మకాన్ని పొందామని భావిస్తున్నామ‌న్నారు. ప్రజలు నిజాలను గమనిస్తారని, వారిని మోసగించేందుకు చంద్ర‌బాబులా తాము అబద్ధాలపై ఆధారపడలేద‌న్నారు.

చంద్రబాబుపై విమర్శలు..
తాజా పరిణామాలపై జగన్‌ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు మోసపూరిత హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, కానీ, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. మేనిఫెస్టోను చెత్త బుట్టలో వేసే సంప్రదాయాన్ని వైసీపీ ప్ర‌భుత్వం మార్చింద‌ని అని టీడీపీపై విమర్శలు గుప్పించారు.

వైఎస్‌ జగన్‌ సమావేశంలో కడప నేతలు, కార్పొరేటర్లు కూటమి ప్రభుత్వ అక్రమాలు, టీడీపీ నేతల పెత్తనంపై ఫిర్యాదు చేశారు. ప్రజలు నిజాయితీని గుర్తిస్తారని, అధికారంలో ఉన్నా లేకపోయినా, ప్రజల కోసం పోరాడటమే మన ధర్మం అంటూ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment