వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయనపై 13 కేసులు నమోదు చేసింది. కాగా, తనపై నమోదైన కేసులపై సజ్జల భార్గవ్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే నమోదైన మొత్తం 13 కేసుల్లో 9 కేసుల విషయంలో ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది.
తనపై నమోదైన కేసులను రద్దు చేయాలంటూ సజ్జల భార్గవ్ కోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం ఈ పిటిషన్‌పై విచారణ జరిపి తాత్కాలిక రక్షణ కల్పించింది. రెండు వారాలపాటు ఈ రక్షణ కొనసాగుతుందని, ఈ వ్యవధిలో ఈ కేసులపై అఫిడవిట్ సమర్పించాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది.
ఈ తీర్పు సజ్జల భార్గవ్‌రెడ్డికి తాత్కాలిక ఉపశమనం ఇచ్చినప్పటికీ, కేసుల విచారణ ఎటువంటి మలుపులు తిరుగుతాయో చూడాల్సి ఉంది.