వైసీపీ (YSRCP) మాజీ ఎంపీ (Former MP) గోరంట్ల మాధవ్ (Gorantla Madhav) ను పోలీసులు అరెస్టు (Arrest) చేశారు. గుంటూరు చుట్టుగుంట ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐటీడీపీ (ITDP) కార్యకర్త చేబ్రోలు కిరణ్ (Chebrolu Kiran) చేసిన కామెంట్స్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర కలకలం సృష్టించాయి. వైఎస్ జగన్ (YS Jagan) భార్య(Wife) వైఎస్ భారతీరెడ్డి (YS Bharathi Reddy)పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన చేబ్రోల్ కిరణ్ కుమార్‌పై దాడి (Attack) చేసేందుకు గోరంట్ల మాధవ్ యత్నించాడు. మాజీ సీఎం కుటుంబంపై జుగుప్సాకరమైన కామెంట్లు చేసిన కిరణ్‌ను ఇబ్రహీంపట్నం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకొని గుంటూరుకు తరలిస్తున్నారు.
సమాచారం అందుకున్న గోరంట్ల మాధవ్ మంగళగిరి నుంచి గుంటూరు తరలిస్తున్న కిరణ్ కుమార్‌ను తరలిస్తున్న పోలీస్ వాహనాన్ని ఫాలో (Follow) అయ్యాడు. మాజీ సీఎం భార్యపై అనుచిత (Inappropriate) వ్యాఖ్యలు చేసిన కిరణ్‌పై దాడికి యత్నించారు మాధవ్. దీంతో విధుల్లో ఉన్న అధికారులను అడ్డుకున్నారనే కారణంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.