తిరుపతిలో డిప్యూటీ మేయర్ పదవి కోసం జరిగిన ఎన్నికలో అధికార పార్టీల అప్రజాస్వామిక విధానాలు బయటపడ్డాయి. బలం లేకపోయినా పోటీలోకి దిగిన కూటమి పార్టీలు డిప్యూటీ మేయర్ పదవిని ఏ విధంగా దక్కించుకుందో టీడీపీకి ఓటేసిన కార్పొరేటర్లు బహిర్గతం చేశారు.
నిన్న ఓటింగ్‌లో పాల్గొనేందుకు వస్తున్న కార్పొరేటర్ల బస్సును కొందరు దుండగులు రాళ్లతో దాడి చేసి అద్దాలు ధ్వంసం చేసి నలుగురు కార్పొరేటర్లను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ ఓటింగ్ పూర్తయింది. టీడీపీకి ఓటు వేసిన వైసీపీ కార్పొరేటర్లు భూమన కరుణాకర్‌రెడ్డి నివాసానికి చేరుకున్నారు. బెదిరించి కూటమికి ఓట్లు వేయించారని కార్పొరేటర్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. తప్పు అయిందంటూ కన్నీరు పెట్టుకుంటూ భూమన కాళ్ల మీద పడ్డారు. కూటమి నేతలు తమను కొట్టి బెదిరించారని, అందుకే ఓటు వేయాల్సి వచ్చిందని, తప్పు అయింది క్షమించు అన్నా.. అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దీంతో భూమన కరుణాకర్‌రెడ్డి వారిని దగ్గరకు తీసుకొని ఓదార్చారు.