మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ‌.. వైసీపీ తీవ్ర ఆగ్ర‌హం

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ‌.. వైసీపీ తీవ్ర ఆగ్ర‌హం

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో మెడికల్ కాలేజీ (Medical Colleges)ల భవిష్యత్తుపై కూటమి ప్రభుత్వం (Coalition Government) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కేబినెట్‌ (State Cabinet) సమావేశంలో వైఎస్ జ‌గ‌న్(YS Jagan) హ‌యాంలో ప్రారంభ‌మైన 17 మెడికల్ కాలేజీల్లో 10 కాలేజీలను పీపీపీ (PPP) విధానంలో ప్రైవేటీకరించాలనే (Privatize) నిర్ణయాన్ని ఆమోదించింది. వైఎస్ జగన్ హయాంలో నిర్మాణానికి శ్రీకారం చుట్టిన కాలేజీలను ఇప్పుడు ప్రైవేటుకు అప్పగించడం పై రాష్ట్రంలో తీవ్ర చర్చ మొదలైంది.

వైసీపీ(YSRCP) నేతలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. జగన్ ప్రభుత్వం 8,450 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టి, ఇప్పటికే ఐదు కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభించిందని గుర్తు చేస్తున్నారు. మిగిలిన కాలేజీలను ప్రైవేటుకు అప్పగించడాన్ని ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నార‌ని, ఇది విద్యా రంగాన్ని దెబ్బతీసే నిర్ణయమని కూట‌మి ప్ర‌భుత్వంపై మండిప‌డుతున్నారు. మొదటి దశలో మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని కాలేజీలను, రెండో దశలో అమలాపురం, బాపట్ల, పెనుకొండ, నర్సీపట్నం, పాలకొల్లు కాలేజీలను ప్రైవేటీకరించనున్నట్లుగా స‌మాచారం.

ఈ పరిణామంపై వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు (Ambati Rambabu) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం దుర్మార్గమని, ఇది చంద్రబాబు తన అనుచరులకు లాభం చేకూర్చే కుట్ర అని మండిపడ్డారు. తనపై అవినీతి ఆరోపణలు చేసి బెదిరింపులు చేస్తున్నా, ఎటువంటి భయం లేదని, అవసరమైతే అరెస్టుకైనా సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. లోకేష్ బెదిరింపులకు తలొగ్గేది లేదని, ఈ పోరాటాన్ని న్యాయస్థానాల్లోనూ కొనసాగిస్తానని హామీ ఇచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment