WTC Final 2025: స్టార్క్‌ చరిత్ర.. షమీ రికార్డు బద్దలు!

WTC Final 2025: స్టార్క్‌ చరిత్ర.. షమీ రికార్డు బద్దలు!

ఆస్ట్రేలియా స్టార్ (Australia Star) పేసర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) చరిత్ర సృష్టించాడు. టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీ (Mohammed Shami)పేరిట ఉన్న ఒక ఆల్‌టైమ్ (All-Time) రికార్డును బద్దలు కొట్టాడు. సౌతాఫ్రికా (South Africa)తో జరుగుతున్న 2023-2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌ (Final)లో రెండు వికెట్లు తీయడం ద్వారా, ఐసీసీ ఫైనల్స్‌ (ICC Finals)లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

స్టార్క్ ఇప్పటివరకు ఐదు ఐసీసీ ఫైనల్స్ ఇన్నింగ్స్‌లలో మొత్తం 11 వికెట్లు పడగొట్టాడు. 2015 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌లో రెండు, 2021-23 డబ్ల్యూటీసీ ఫైనల్‌లో నాలుగు, 2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌లో మూడు, మరియు ప్రస్తుతం జరుగుతున్న 2023-25 డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రెండు వికెట్లు తీశాడు.

గతంలో ఈ రికార్డు షమీ పేరిట ఉండేది. షమీ ఐసీసీ ఫైనల్స్‌లో ఆరు ఇన్నింగ్స్‌లలో 10 వికెట్లు తీశాడు. ఐసీసీ ఫైనల్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో స్టార్క్, షమీ తర్వాతి స్థానాల్లో ట్రెంట్ బౌల్ట్ (5 ఇన్నింగ్స్‌లలో 8 వికెట్లు), రవీంద్ర జడేజా (10 ఇన్నింగ్స్‌లలో 8), కైల్ జేమీసన్ (3 ఇన్నింగ్స్‌లలో 8) ఉన్నారు.


WTC ఫైనల్: తొలి రోజు ఆట హైలైట్స్

ఇంగ్లండ్‌ (England)లోని లార్డ్స్ మైదానం (Lords Stadium) వేదికగా ఆస్ట్రేలియా (Australia), సౌతాఫ్రికా (South Africa) మధ్య జరుగుతున్న WTC 2023-25 ఫైనల్‌లో ఉత్కంఠ కొనసాగుతోంది. నిన్న (జూన్ 11) మొదలైన ఈ టైటిల్ పోరులో సౌతాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.

రబాడ (5/51), జాన్సెన్ (3/49), కేశవ్ మహారాజ్ (1/19), మార్క్రమ్ (1/5) విజృంభించడంతో ఆస్ట్రేలియా (Australia) రెండు సెషన్లలోపే 212 పరుగులకే ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (66), బ్యూ వెబ్‌స్టర్ (72) అర్ధ సెంచరీలతో రాణించడంతో ఆసీస్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. మిగతా ఆసీస్ బ్యాటర్లలో అలెక్స్ క్యారీ (23), లబూషేన్ (17), ట్రావిస్ హెడ్ (11) రెండంకెల స్కోర్లు చేయగా, గ్రీన్ (4), కమిన్స్ (1), స్టార్క్ (1) సింగిల్ డిజిట్‌లకే పరిమితమయ్యారు. ఉస్మాన్ ఖ్వాజా, నాథన్ లియోన్ డకౌట్లయ్యారు.

ఆసీస్‌ను తక్కువ స్కోర్‌కే పరిమితం చేసిన ఆనందం సౌతాఫ్రికాకు ఎంతోసేపు నిలవలేదు. తొలి ఓవర్‌లోనే వికెట్ (మార్క్రమ్ డకౌట్) కోల్పోయిన ఆ జట్టు, మరో 20 ఓవర్ల వ్యవధిలో కేవలం 30 పరుగులు మాత్రమే చేసి మొత్తం నాలుగు వికెట్లను చేజార్చుకుంది. స్టార్క్ (2/10), హాజిల్‌వుడ్ (1/10), కమిన్స్ (1/14) అద్భుతమైన బౌలింగ్‌తో సౌతాఫ్రికా బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఒక్కో పరుగు చేసేందుకు సౌతాఫ్రికా బ్యాటర్లు తీవ్రంగా శ్రమించారు. ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్న బవుమా ఖాతా తెరిచేందుకు ఏకంగా 31 బంతులు తీసుకోవడం గమనార్హం.

సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో రికెల్టన్ 16, ముల్దర్ 6, స్టబ్స్ 2 పరుగులకు ఔటయ్యారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా స్కోర్ 43/4గా ఉంది. బవుమా (3)తో పాటు బెడింగ్హమ్ (8) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు సౌతాఫ్రికా ఇంకా 169 పరుగులు వెనుకబడి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment