తుఫాన్ పున‌రావాస కేంద్రంలో పాముకాటు

తుఫాన్ పున‌రావాస కేంద్రంలో పాముకాటు

మొంథా తుఫాన్‌ (Montha Cyclone) తో భ‌యాందోళ‌న‌కు గురై పున‌రావాస కేంద్రాల‌కు (Rehabilitation Centers) వెళ్లిన ప్ర‌జ‌ల‌కు అక్క‌డా ర‌క్ష‌ణ క‌రువైంది. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డలో మంగళవారం రాత్రి భయానక ఘటన చోటు చేసుకుంది. తుఫాన్‌ తీవ్రత పెరగడంతో గ్రామానికి చెందిన కట్ట లక్ష్మీ తిరుపతమ్మ (Lakshmi Tirupatamma)తన ఇద్దరు పిల్లలు, బంధువులతో కలిసి స్థానిక జెడ్పీహెచ్ఎస్ (ZPHS) పాఠశాలలో (School) ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేరుకున్నారు. రాత్రి ఒంటి గంట సమయానికి ఆమె కుమార్తె అక్షయ (Akshaya) వాష్‌రూమ్‌కు వెళ్లాలని చెప్పడంతో తిరుపతమ్మ ఆమెను తీసుకుని వెళ్లింది.

వాష్‌రూమ్ దగ్గర ఉన్న కట్లపాము (Viper Snake) అనుకోకుండా ఆమె కాలిపై కాటు వేసి, కొంతసేపు గట్టిగా పట్టుకుంది. తిరుపతమ్మ కేకలు వేయడంతో అక్కడున్న బంధువులు పరుగెత్తుకుంటూ వచ్చి పామును చంపి, ఆమెను తక్షణమే 108 యాంబులెన్స్ ద్వారా చల్లపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాటుతో క్షణాల్లోనే ఆమెకు గుండె బరువుగా మారడం, కళ్ళు తిరగడం వంటి లక్షణాలు కనిపించాయని వైద్య సిబ్బంది తెలిపారు.

ప్రస్తుతం తిరుపతమ్మకు స్నేక్ బైట్ యాంటీ వీనమ్ ఇంజెక్షన్లు అందజేస్తున్నారని, ఆమె పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. తాను బతికిపోయినా, తన ఇద్దరు చిన్న పిల్లల పరిస్థితి గురించి ఆందోళన వ్యక్తం చేసిన తిరుపతమ్మ కన్నీళ్లు పెట్టుకున్నారు. గ్రామస్తులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment