RCB కప్పు కొట్టకపోతే నా భార్య‌కు విడాకులిస్తా.. వీడియో వైర‌ల్‌

RCB కప్పు కొట్టకపోతే నా భార్య‌కు విడాకులిస్తా.. వీడియో వైర‌ల్‌

Summarize with AI

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ (IPL)లో భారీ ఫాలోయింగ్ ఉన్న టీమ్‌ల‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ముందుంటుంది. కానీ, ఈ గ్లోరీస్ జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ (Title) అందుకోలేకపోవడం ఆశ్చర్యం క‌లిగించే విష‌య‌మే. ఇప్పటి వరకు 17 సీజన్‌లు గడిచినప్పటికీ RCB టైటిల్ ఖాతా ఖాళీగానే ఉంది.

ఈ ఏడాది మాత్రం RCB మంచి ఫామ్‌తో ముందుకు సాగుతోంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ బెర్త్ (Playoffs Berth) ఖరారు చేసుకున్న టీమ్, టైటిల్ ఆశలు పటిష్టంగా పెంచింది. ఈ నేపథ్యంలో ఒక అభిమాని చేసిన వ్యాఖ్య నెట్టింట తెగ వైరలవుతోంది. “ఈసారి కూడా RCB కప్పు గెలవలేకపోతే… నా భార్యకు విడాకులు ఇస్తా” అంటూ ఆ ఫ్యాన్ చేసిన కామెంట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను షేక్ చేస్తోంది.

ఆ వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది ఫన్నీగా తీసుకుంటే, మరికొంతమంది దీనిని ఓవ‌ర్ యాక్ష‌న్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆర్సీబీ ఈసారి అభిమానుల ఆశలు నెరవేరుస్తుందా..? ఒక్క టైటిల్ లేద‌న్న నింద‌ను తుడిపేసుకుంటుందా..? అన్నది ఆసక్తికర ప్రశ్నగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment