మామునూర్ ఎయిర్‌పోర్ట్.. బీజేపీ-కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌

మామునూర్ ఎయిర్‌పోర్ట్.. బీజేపీ-కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌

వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్‌పోర్ట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ నేతలు వేర్వేరుగా సంబరాలు జరుపుకునేందుకు అక్కడికి చేరుకున్నారు. అయితే, ఒకే ప్రాంతంలో రెండు పార్టీల కార్యకర్తలు భారీగా గుమిగూడడంతో వాగ్వాదం ప్రారంభమై తోపులాటకు దారి తీసింది.

మామునూర్ విమానాశ్రయ అభివృద్ధికి కేంద్రం నుంచి అంగీకారం రావడం పట్ల వరంగల్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్‌పోర్ట్ నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రయాణ సౌకర్యాలు మెరుగవ్వడంతో పాటు వ్యాపారం, పర్యాటక రంగాలు అభివృద్ధి చెందనున్నాయి.

అయితే, ఈ అనుమతిని తమ పార్టీ విజయం అని చెప్పుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. ప్రధాన గేటు వద్ద బీజేపీ కార్యకర్తలు ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయగా, అదే ప్రదేశంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నేతలు పాలాభిషేకం చేయాలని ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో మాటల యుద్ధం తీవ్ర రూపం దాల్చి తోపులాటకు దారి తీసింది. వివాదం మరింత ముదరుతుందనుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెద‌ర‌గొట్టారు.

Join WhatsApp

Join Now

Leave a Comment