‘ఓటుకు నోటు’ కేసు నేడు సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణకు రానుంది. ఈ కేసులో రేవంత్‌రెడ్డి (Revanth Reddy), సండ్ర వెంకట వీరయ్య (Sandra Venkata Veerayya) దాఖలు చేసిన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరపనుంది.
రేవంత్‌రెడ్డి తన పిటిషన్‌లో, ఈ కేసును అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్) (PC Act) కింద కాకుండా, కేవలం ఎన్నికల చట్టాల కిందనే విచారణ చేయాలని కోరుతున్నారు. మరోవైపు, సండ్ర వెంకట వీరయ్య ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలని కోరుతూ పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్లను జస్టిస్ జె.కె. మహేశ్వరి (J.K.Maheshwari), జస్టిస్ విజయ్ బిష్ణోయీ (Vijay Bishnoi)లతో కూడిన ధర్మాసనం విచారించనుంది. గత విచారణ సందర్భంగా, ఓటుకు నోటు కేసులో మత్తయ్యకు సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పు కాపీలను సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.
ఇదే కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి (Jagadishwar Reddy)ని ఇంప్లీడ్ (పక్షంగా చేర్చుకోవడం) చేసేందుకు అనుమతించాలని అడ్వకేట్ ఆర్యమ సుందరం అభ్యర్థించారు. అయితే, ఇంప్లీడ్‌ను అనుమతించవద్దని రేవంత్‌రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా సుప్రీంకోర్టును కోరారు.







