గాజువాకలో సంచలనం సృష్టించిన మౌనిక హత్య కేసులో నిందితుడు రవీంద్ర క్రూరత్వం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. కేవలం హత్య చేయడమే కాకుండా, మృతదేహాన్ని ముక్కలు చేసిన వైనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు వివరాలను గాజువాక ఏసీపీ శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు.
డేటింగ్ యాప్ పరిచయం..
పోలీసుల విచారణలో తేలిన వివరాల ప్రకారం.. నిందితుడు రవీంద్రకు 2021లో ‘డేటింగ్ యాప్’ ద్వారా మౌనికతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. అయితే, రవీంద్ర 2024లో మరో యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లయినప్పటికీ మౌనికతో తన సంబంధాన్ని కొనసాగించాడు. ఇటీవల రవీంద్ర భార్య డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లడంతో, మౌనికను తరచూ తన ఇంటికి పిలిపించేవాడు.
కుటుంబానికి అడ్డని ఘాతుకం
మౌనికతో సంబంధం తన వైవాహిక జీవితానికి, కుటుంబానికి ఎప్పటికైనా అడ్డుగా మారుతుందని రవీంద్ర భావించాడు. ఈ క్రమంలోనే ఆమెను అడ్డు తొలగించుకోవాలని పథకం వేశాడు. ఇంట్లోనే మౌనిక గొంతు నులిమి అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఆపై ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు మృతదేహాన్ని మూడు ముక్కలు చేశాడు. అయితే, ఆ శరీర భాగాలను ఏం చేయాలో, ఎక్కడ పారేయాలో తెలియక భయంతో పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
నేడు కేజీహెచ్‌లో పోస్టుమార్టం
ప్రస్తుతం నిందితుడు రవీంద్ర విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్నాడు. కోర్టు అతనికి ఏప్రిల్ 10 వరకు రిమాండ్ విధించింది. మరోవైపు, మౌనిక మృతదేహానికి ఈరోజు విశాఖపట్నం కేజీహెచ్ (KGH)లో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. కేవలం వేధింపుల వల్లే ఈ హత్య జరిగిందా? లేక మరేదైనా బలమైన కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రవీంద్ర సెల్ ఫోన్ డేటాను కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. డేటింగ్ యాప్స్ ద్వారా జరిగే పరిచయాల పట్ల యువత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.









“హీరోలకు 90 రోజులకు ఒకసారి డ్రగ్స్ టెస్ట్ చేయాలి”