‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రిలీజ్ డేట్ ఫిక్స్

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రిలీజ్ ఫిక్స్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya), టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ (Viswanath And Sons) రిలీజ్ డేట్ (Release Date) ఫైనల్ అయ్యింది. ఫ్యామిలీ ఎమోషన్స్, క్లాస్ టచ్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 14న (August 14) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

స్వాతంత్ర దినోత్సవ (Independence Day) లాంగ్ వీకెండ్‌ను (Long Weekend) టార్గెట్ చేస్తూ రిలీజ్ ప్లాన్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచగా, ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar)బ్లాక్‌బస్టర్ తర్వాత వెంకీ అట్లూరి నుంచి వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

ఇటీవల ‘కరుప్పు’ (Karuppu) సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సూర్య అదే జోష్‌లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో మరో భారీ విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమాలో సూర్య (Suriya) సరసన యంగ్ సెన్సేషన్ మమితా బైజు (Mamitha Baiju) హీరోయిన్‌గా నటిస్తుండగా, రాధికా శరత్‌కుమార్ (Radhika Sarathkumar), రవీనా టాండన్ (Raveena Tandon) కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ (G. V. Prakash Kumar) సంగీతం అందిస్తున్న ఈ మూవీ క్లాస్, మాస్ ఆడియెన్స్‌ను ఒకేసారి ఆకట్టుకునేలా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment