విశాఖలో దారుణ హత్య.. బిచ్చగాడిని కొట్టి చంపిన షాప్ య‌జ‌మాని

విశాఖలో దారుణ హత్య.. బిచ్చగాడిని కొట్టి చంపిన షాప్ య‌జ‌మాని

ప్ర‌శాంత‌త‌కు మారుపేరుగా ఉన్న ఉత్త‌రాంధ్ర (North Andhra) ప్రాంతంలో ఇటీవ‌ల అత్యాచారాలు (Rapes), హ‌త్య‌లు (Murders), డ్ర‌గ్స్ (Drugs) స‌ర‌ఫ‌రా వంటివి విప‌రీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా విశాఖపట్నం (Visakhapatnam) నగరంలోని దువ్వాడ (Duvvada) పోలీస్ స్టేషన్ (Police Station) పరిధిలో ఘోరమైన హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. రాజీవ్ నగర్ కాలనీ వద్ద నివసించే ఓ బిచ్చగాడిని (Beggar) స్క్రాప్ కొట్టు (Scrap Shop) యజమాని దేవరాజ్ (Devaraj) హతమార్చిన ఘటన స్థానికులను భ‌యాందోళ‌న‌కు గురిచేసింది. ఈ ఘటన నాలుగు రోజుల క్రితం జరిగినప్పటికీ తాజాగా వెలుగులోకి వచ్చింది.

హత్య అనంతరం మృతదేహాన్ని ముళ్ళపొదల్లో పడేసిన దేవరాజ్, సాక్ష్యాలను మాయం చేయాలని ప్రయత్నించాడు. కానీ, ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బిచ్చ‌గాడి హ‌త్య కేసుపై దువ్వాడ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో చెత్త అమ్మకం విషయమై దేవరాజ్, బిచ్చగాడి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదం ముదిరి బిచ్చగాడు దేవరాజ్‌పై దాడికి దిగడంతో, కోపంతో ఆయన హత్యకు పాల్పడ్డట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుడిపై హత్యా కేసు నమోదు చేసి కస్టడీకి తీసుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment