విశాఖపట్నం (Visakhapatnam) లో మ్యారేజ్ బ్యూరో (Marriage Bureau) ముసుగులో యువతులపై అత్యాచారానికి (Sexual Assault) పాల్పడుతున్న దారుణ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లికి ఆసక్తి ఉన్న యువతులను (Young Women) టార్గెట్ చేస్తూ ఓ ముఠా కిరాతక వ్యూహం పన్నింది. మ్యారేజ్ బ్యూరో, హెర్బల్ ప్రొడక్ట్స్, టూవీలర్ రైడ్ల పేర్లతో అమ్మాయిల వివరాలను సేకరిస్తున్నారు. ప్రొడక్ట్స్ చూపించే పేరుతో వారికి దగ్గరవుతున్నారు. స్నేహం పెంచుకొని మత్తు మందు (Intoxicants) ఇచ్చి వారిపై అత్యాచారాలు చేయడమే కాకుండా, వీడియో(Video) తీసి వారిని బ్లాక్‌మెయిల్ (Blackmail) చేస్తున్న ఈ దారుణమైన సంఘటన విశాఖ నాలుగోవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ముఠా దుర్మార్గాలపై బాధితుల్లో ఒకరు ధైర్యంగా ముందుకు వచ్చి మీడియా (Media)ను ఆశ్రయించడంతో ఈ అఘాయిత్యాలు వెలుగులోకి వచ్చాయి.
బాధితురాలి వివరాల ప్రకారం.. ”యువతులను ట్రాప్ చేసి మత్తుమందు ఇచ్చిన బాధితులు స్పృహలో వారిపై అత్యాచారం చేసి నగ్న వీడియోలు (Nude Videos) చిత్రీకరిస్తారు. వీడియోను అడ్డంపెట్టుకొని బ్లాక్ మెయిల్ చేయడం, గర్భం దాల్చిన వారి పట్ల క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. గర్భం దాల్చిన వారిని అబార్షన్ చేయించుకోవాలని బెదిరిస్తున్నారు. మాట వినకపోతే సుపారీ కిల్లర్ల (Contract Killers) తో చంపిస్తామన్న బెదిరించి భయపెడతారు. ఈ ముఠా వద్ద సుమారు 30 మంది యువతుల నగ్న వీడియోలు ఉన్నాయి. వీడియోలను అడ్డం పెట్టుకొని బాధిత యువతుల నుంచి డబ్బు బ్లాక్‌మెయిల్ చేసి హింసిస్తోంది.
ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. బాధితులందరినీ ముఠా బారి నుంచి రక్షించి, నిందితులకు కఠినమైన శిక్షలు విధించాలి” అని బాధిత యువతి కోరుతోంది. ఇప్పటికైనా పోలీసులు స్పందిస్తారా? బాధితురాలి ఫిర్యాదును పట్టించుకోని అధికారులపై చర్యలు తీసుకుంటారా? అనేది వేచి చూడాలి.
“బ్రాహ్మణులపై మూత్రం పోస్తా” – అనురాగ్ కశ్యప్ వివాదాస్పద వ్యాఖ్య