విశాఖ (Visakhapatnam) స్టీల్ ప్లాంట్ని (Steel Plant)ర్వాసితుల ఉద్యమం (Movement) ఉధృతంగా మారింది. ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద నిర్వాసితుల ఆందోళన ఉద్యమంగా మారింది. భూములు (Lands) కోల్పోయిన కుటుంబాలకు ఇప్పటికీ సరైన పరిహారం, ఉద్యోగాలు అందకపోవడంతో బాధితులు ప్లాంట్ గేటుకి అడ్డంగా బైఠాయించి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల భారీ సంఖ్యలో కాంట్రాక్టు కార్మికులను (Contract Workers) తొలగించడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. ఉద్యోగాలు ఇవ్వకపోయినా నెలకు రూ.25 వేల భృతి అందించాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు.
నిర్వాసితుల పోరాటానికి వైసీపీ (YSRCP) నాయకులు మద్దతు ప్రకటించారు. కార్మికులతో కలిసి వైసీపీ స్థానిక నేతలు నిరసనల్లో పాల్గొంటూ, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, నిర్వాసితులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. భారీగా పోలీసులు మోహరించినప్పటికీ నిరసనకారులు వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు.
చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నాడు.. – వడ్డే శోభనాదీశ్వరరావు
మాజీ మంత్రి వడ్డే శోభనాదీశ్వరరావు (Vadde Shobhanadishwara Rao) కూడా నిర్వాసితుల దీక్ష స్థలానికి చేరుకుని సంఘీభావం తెలిపారు. “విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు” అంటూ ఆయన నినాదాలు చేశారు. నిర్వాసితులు చేసిన త్యాగాలు వృథా కావొద్దని, వారి కోసం ప్రభుత్వం, కేంద్రం కలిసి వెంటనే ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపై ఆధారపడుతుంటే, రాష్ట్రం మళ్లీ కేంద్రంపై నెట్టేయడం వల్ల సమస్య ఇంకా పెరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు స్టీల్ ప్లాంట్ సమస్యపై చేసిన తాజా వ్యాఖ్యలు సరైనవేమీ కావన్నారు వడ్డే శోభనాదీశ్వరరావు. “స్టీల్ ప్లాంట్ నష్టాలు ఎందుకు వస్తున్నాయో అడుగుతున్న చంద్రబాబు అమాయకత్వమో? లేక ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమో?” అని ఆయన ప్రశ్నించారు. నిర్వాసితుల పోరాటం కొనసాగుతున్న వేళ, రాజకీయ నాయకుల వ్యాఖ్యలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి విశాఖ ఉక్కు భవిష్యత్‌పై మరింత చర్చకు దారితీస్తున్నాయి.








