టీ20కి గుడ్‌బై.. రిటైర్మెంట్ రీజ‌న్ చెప్పిన విరాట్‌ కోహ్లి

టీ20కి గుడ్‌బై.. రిటైర్మెంట్ రీజ‌న్ చెప్పిన విరాట్‌ కోహ్లి

భారత క్రికెట్ స్టార్ (Indian cricket star) విరాట్ కోహ్లి (Virat Kohli) తన T20 అంతర్జాతీయ కెరీర్‌ (T20 International Career)కు గుడ్‌బై (Goodbye) చెప్పిన నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. టీ20 వరల్డ్‌కప్ ముగిశాక రిటైర్మెంట్ (Retirement) ప్రకటించడం వెనుక ఉన్న కారణాన్ని ఆయన వివరించారు. రిటైర్మెంట్‌పై RCB పాడ్‌కాస్ట్‌లో స్పందించిన కోహ్లీ “రిటైర్మెంట్‌ నిర్ణయం (టీ20ల నుంచి వైదొలగడం) పూర్తిగా కొత్త త‌రం ఆటగాళ్ల అవసరాన్ని అర్థం చేసుకుని తీసుకున్నది. వారికి అనుభవం అవసరం, 2 సంవత్సరాల సైకిల్‌లో ప్రపంచం నలుమూలల ప్లేస్‌లలో మ్యాచ్‌లు ఆడి ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఇవ్వాలి. తద్వారా వచ్చే వరల్డ్ కప్‌ (World Cup) కి వారు సిద్ధంగా ఉంటారు” అని కోహ్లీ వివ‌ర‌ణ ఇచ్చారు.

విరాట్ కోహ్లి భారత్ తరఫున ఇప్పటివరకు 125 T20 మ్యాచ్లు ఆడి, ఎన్నో మ్యాచ్‌ల్లో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. అభిమానుల మనసు తాకేలా తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని సూటిగా చెప్పిన కోహ్లికి అభిమానుల నుండి ప్రేమాభిమానాలు వెల్లువెత్తుతున్నాయి.

టీ20ల నుంచి విరమించినా, ఐపీఎల్‌లో మాత్రం విరాట్ కోహ్లీ త‌న దుమ్ము దులుపుతూనే ఉన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్‌లో 10 మ్యాచ్‌లలో 443 పరుగులు, సగటు 63.28తో మూడు టాప్ స్కోరర్లలో మూడవ స్థానంలో ఉన్నాడు.

Join WhatsApp

Join Now

Leave a Comment