శ్రీ‌కాళ‌హ‌స్తిలో దారుణం.. డ్రైవ‌ర్‌ను హ‌త్య చేసిన జనసేన నేత‌

శ్రీ‌కాళ‌హ‌స్తిలో దారుణం.. డ్రైవ‌ర్‌ను హ‌త్య చేసిన జనసేన నేత‌

శ్రీకాళహస్తి (Srikalahasti)లో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. త‌మ ద‌గ్గ‌ర ప‌నిచేసే డ్రైవ‌ర్‌ (Driver)ను చిత్ర‌హింస‌ల‌కు గురిచేసి, ఆపై హ‌త్య (Murder)చేసి న‌ది (River)లో ప‌డేసిన కేసులో శ్రీ‌కాళ‌హ‌స్తి జనసేన పార్టీ (Janasena Party) ఇన్‌చార్జ్ (In-Charge) వినూత దంప‌తులు (Vinooth Couple) అరెస్ట్ (Arrested) అయ్యారు. హ‌త్య కేసును ఛేదించిన పోలీసులు వినూత, ఆమె భర్త చంద్రబాబు (Chandrababu)తో సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు.

ఈనెల 8వ తేదీన చెన్నై (Chennai)లోని కూవం నది (Cooum River) 4వ ప్రవేశద్వారం వద్ద ఎంఎస్ నగర్ హౌసింగ్ బోర్డు నివాసం వెనుక రాయుడు (Rayudu) శవం (Dead Body) లభ్యమైంది. తమిళనాడు (Tamil Nadu) సెవెన్‌వెల్స్ (Sevenwells) పోలీసులు (Police) సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా హత్యలో పాల్గొన్న శివకుమార్ (Shivakumar), గోపి (Gopi), దాసర్ (Dasar), చంద్రబాబు (Chandrababu), వినూతలను (Vinooth) అరెస్ట్ చేశారు. నిందితులను శ్రీకాళహస్తికి తీసుకొచ్చి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, రాయుడు శ్రీకాళహస్తిలోని జనసేన ఇన్‌చార్జ్ వినూత డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ హ‌త్య‌కు వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారం కార‌ణంగా తెలుస్తోంది. వినూత భ‌ర్త చంద్ర‌బాబు మృతుడు రాయుడిని చిత్రహింసలకు గురిచేసి, హత్య చేసిన అనంతరం శవాన్ని చెన్నైలోని కూవం నదిలో పడేసినట్లు తెలుస్తోంది. హత్యకు ఖచ్చితమైన కారణాలు ఇంకా స్పష్టం కానప్పటికీ, వ్యక్తిగత విష‌యాల‌తోనే హ‌త్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ (CCTV Footage) లో నిందితులు రాయుడిని గోడౌన్ నుంచి బలవంతంగా తీసుకెళ్లడం, ఆ తర్వాత చెన్నైలో శవాన్ని వదిలేసిన దృశ్యాలు రికార్డు అయినట్లు సెవెన్‌వెల్స్ పోలీసులు తెలిపారు.

జనసేన ఇన్‌చార్జ్‌గా ఉన్న వినూత, ఆమె భర్త చంద్రబాబు ఇలాంటి దారుణ హత్యకు పాల్పడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. అధికారంలో ఉన్నామ‌ని కూట‌మి నేత‌లు ఇష్టానుసారంగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని ప్ర‌తిప‌క్ష వైసీపీ(YSRCP) ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. త‌మ ద‌గ్గ‌ర ప‌నిచేస్తున్న డ్రైవ‌ర్‌ను అత్యంత కిరాత‌కంగా కొట్టి హ‌త్య చేయ‌డంపై స్థానికులు సైతం మండిప‌డుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment