కోలీవుడ్ స్టార్ (Kollywood Star) విజయ్ సేతుపతి (Vijay Sethupathi) నటించిన కొత్త చిత్రం ‘తలైవా తలైవి’ (‘Thalaiva Thalaivi’) టీజర్ (Teaser) తాజాగా విడుదలైంది (Released). ఈ చిత్రంలో ఆయనకు జోడీగా న్యాషనల్ అవార్డ్ విజేత నిత్యా మీనన్ (Nithya Menen) నటిస్తున్నారు. టీజర్‌తో పాటు మూవీ విడుదల తేదీని కూడా చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
పాండిరాజ్ (Pandiraj) దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిలింస్ (Sathya Jyothi Films) నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. తాజాగా ప్రకటించిన సమాచారం ప్రకారం, ఈ సినిమా జూలై 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, నిత్యా మీనన్‌లతో పాటు యోగిబాబు, సెంబన్ వినోద్ జోస్, దీపా శంకర్, శరవణన్, రోషిణి హరిప్రియన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
తమిళంతో పాటు తెలుగు భాషలోనూ ఈ చిత్రం ఏకకాలంలో విడుదల కాబోతోందని నిర్మాతలు తెలిపారు. టీజర్‌కి మంచి స్పందన వస్తుండటంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.