---Advertisement---

ఎయిర్‌పోర్ట్‌లో విజయ్-రష్మిక.. మ‌ళ్లీ దొరికేశారు

ఎయిర్‌పోర్ట్‌లో విజయ్-రష్మిక.. మ‌ళ్లీ దొరికేశారు
---Advertisement---

టాలీవుడ్‌ రూమర్ కపుల్‌గా పేరొందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మళ్లీ విమానాశ్రయంలో కనిపించి చర్చలకు తావిచ్చారు. మొదట ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఒకరి తర్వాత మరొకరు చేరుకున్న వీరు, ఆ తర్వాత హైదరాబాద్‌ విమానాశ్రయంలో కలిసి కనిపించారు.

క్యాప్ చర్చకు కేంద్రబిందువు
విమానాశ్రయంలో రష్మిక చేతిలో కనిపించిన క్యాప్, తర్వాత విజయ్‌ ధరించడం సోషల్ మీడియాలో కొత్త చర్చలకు తెరతీసింది. ఈ విష‌యాన్ని గమనించిన అభిమానులు, వీరిద్దరూ కలిసి ప్రయాణం చేస్తున్నారా అనే ప్రశ్నను లేవనెత్తుతున్నారు. అందులోనూ, వీరు న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం విదేశాలకు వెళ్లనున్నారు అనే వార్తలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

ప్రశ్నలకు గట్టి సమాధానమా?
విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న మధ్య ఉన్న సంబంధంపై ఎప్పటినుంచో రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ, ఇప్పటివరకు ఈ ఇద్దరూ ఏ విషయంపైనా అధికారికంగా స్పందించలేదు. ఈసారి విమానాశ్రయంలో కనిపించడంతో మ‌ళ్లీ వీరి జంట‌పై చ‌ర్చ మొద‌లైంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment