వెడ్డింగ్ ప్రమోషన్ డీల్ రిజక్ట్ చేసిన విజయ్–రష్మిక

కోట్ల ఆఫర్ డీల్ ను రిజక్ట్ చేసిన విజయ్ – రష్మిక

టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి వార్తల మధ్య మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. ఈ క్రేజీ జంట పెళ్లి వీడియో హక్కుల కోసం ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ఆఫర్ ఇచ్చినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అయితే గతంలో నయనతార వెడ్డింగ్ వీడియో వ్యవహారంలో తలెత్తిన న్యాయపరమైన సమస్యలను దృష్టిలో పెట్టుకుని విజయ్ – రష్మిక జాగ్రత్తగా ముందడుగు వేస్తున్నారని సమాచారం. తమ వ్యక్తిగత వేడుకను వాణిజ్యపరంగా మార్చడం తమకు ఇష్టం లేదని, అందుకే కోట్లు ఆఫర్ చేసినా ఆ డీల్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.

ఈ జంట తమ పెళ్లిని కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ప్రైవేట్‌గా నిర్వహించాలని నిర్ణయించుకున్నారట. నయనతార- ధనుష్ వివాదం తర్వాత చాలామంది సెలబ్రిటీలు పెళ్లి వీడియోల విషయంలో మరింత జాగ్రత్త పడుతున్న నేపథ్యంలో, విజయ్ – రష్మిక తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశమైంది. అభిమానులు మాత్రం ఈ జంట అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment