విజయ్, రష్మిక వయలెంట్ లుక్స్‌.. బాక్సాఫీసు రక్తపాతమే..

విజయ్, రష్మిక వయలెంట్ లుక్స్‌.. బాక్సాఫీసు రక్తపాతమే..

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) కెమిస్ట్రి గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. గీతా గోవిందం, డియర్ కామ్రెడ్ వంటి హిట్ చిత్రాల్లో జంటగా నటించిన ఈ ఇద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారని, వచ్చే ఏడాది పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక కెరీర్ విషయానికి వస్తే.. ఇప్పటివరకు రొమాంటిక్ కథలతో (Romantic Stories) ప్రేక్షకులను మెప్పించిన విజయ్, రష్మిక.. ఈసారి మాత్రం పూర్తిగా వయలెంట్ ట్రాక్ (Violent Track) ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘రౌడీ జనార్ధన్’ (Rowdy Janardhan) ఫస్ట్ లుక్ అందరినీ షాక్‌కు గురి చేసింది. ఒళ్లంతా రక్తం, చేతిలో పెద్ద కత్తి, ఫుల్ రగ్డ్ లుక్‌లో విజయ్ కనిపించడం చూస్తే… “ఇది నిజంగానే రౌడీ స్టోరీనే!” అనే ఫీలింగ్ కలుగుతోంది.

ఇక రష్మిక విషయానికి వస్తే… ఆమె పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్న ‘మైసా’ (Mysa) గ్లింప్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. గన్ పట్టుకుని, యాక్షన్ మోడ్‌లో రష్మిక కనిపించిన తీరు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఒకప్పుడు సాఫ్ట్, సింపుల్ లుక్స్‌తో కనిపించిన ఈ హీరోయిన్… ఇప్పుడు ఊరమాస్ అవతార్‌లో దర్శనమిస్తోంది.

సోషల్ మీడియాలో హాట్ టాపిక్
కాబోయే భార్యభర్తలుగా ప్రచారం జరుగుతున్న ఈ జంట… ఇద్దరూ ఒకేసారి వయలెంట్ లుక్స్‌లో కనిపించడంతో నెట్టింట చర్చ మొదలైంది. “ఎలా ఉండేవారు… ఇలా ఎలా మారిపోయారు?” అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. రష్మిక పోస్టులు వైరల్ అవుతుండగా, విజయ్ లుక్‌పై కూడా ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఈ మారిన అవతారాలు చూస్తుంటే… ఈసారి బాక్సాఫీస్ వద్ద రక్తపాతమే జరుగబోతోందా? అనే డౌట్ అందరిలోనూ నెలకొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment