విజయ్ దేవరకొండ – రష్మిక పెళ్లి? డెక‌రేష‌న్‌ వీడియోలు వైరల్

విజయ్ దేవరకొండ – రష్మిక పెళ్లి? డెక‌రేష‌న్‌ వీడియోలు వైరల్

టాలీవుడ్ రౌడీ బాయ్‌ విజయ్ దేవరకొండ, నేష‌న‌ల్ క్ర‌ష్‌ రష్మిక మందన వివాహంపై మరోసారి సోషల్ మీడియా హీట్ పెరిగింది. రూమర్డ్ కపుల్‌గా పేరున్న ఈ జంట ఈరోజే పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. గత కొన్ని నెలలుగా వీరి ఎంగేజ్‌మెంట్‌, పెళ్లి తేదీపై పలు వార్తలు వచ్చినప్పటికీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

తాజాగా రాజస్థాన్‌లోని ఉదయపూర్ ప్యాలెస్‌లో భారీ స్థాయిలో డెకరేషన్ పనులు జరుగుతున్న వీడియోలు వైరల్ కావడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. వైరల్ అవుతున్న వీడియోల్లో ప్యాలెస్‌ను పెళ్లి వాతావరణానికి అనుగుణంగా అలంకరిస్తున్నట్లు కనిపిస్తోంది. వీడియో చిత్రీకరించిన వారు “ఇది విజయ్ దేవరకొండ – రష్మిక మందన పెళ్లి ఏర్పాట్లే కావొచ్చు” అంటూ హింట్ ఇచ్చారు. అయితే ఇది నిజంగానే వారి వివాహ ఏర్పాట్లేనా అన్న విషయంపై ఎలాంటి స్పష్టత లేదు.

గతంలోనూ లీకైన ఎంగేజ్‌మెంట్ వార్తలు
గతేడాది అక్టోబర్ 3న హైదరాబాద్‌లోని విజయ్ దేవరకొండ నివాసంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరిద్దరి నిశ్చితార్థం జరిగిందని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఆ విషయంపై విజయ్ కానీ, రష్మిక కానీ ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు. అనంతరం సినిమా ప్రమోషన్స్ సమయంలో ఈ ప్రశ్న ఎదురైతే రష్మిక “సమయం వచ్చినప్పుడు అన్నీ చెబుతా” అంటూ సమాధానం ఇచ్చింది. ఆ సమయంలోనే విజయ్ దేవరకొండ, రష్మిక వేలికి రింగ్స్ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో వీరి ఎంగేజ్‌మెంట్ వార్తలకు మరింత బలం చేకూరింది.

ఉదయపూర్ ప్యాలెస్‌లోనే పెళ్లి?
విజయ్ – రష్మిక పెళ్లి రాజస్థాన్‌లోని ఉదయపూర్ ప్యాలెస్‌లోనే జరగబోతుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. రష్మిక ఇటీవల అక్కడికి వెళ్లడం కూడా ఈ ప్రచారానికి దారితీసింది. అంతేకాదు, కొన్ని రోజుల క్రితం వీరి వివాహం ఫిబ్రవరి 26న జరిగే అవకాశం ఉందంటూ మరోసారి లీకులు వచ్చాయి. ఇప్పుడు ఒక్కసారిగా “ఈరోజే పెళ్లి” అంటూ కొత్త పుకార్లు మొదలవడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. మరి విజయ్ దేవరకొండ – రష్మిక మందన నిజంగానే కలిసి అభిమానులకు షాక్ ఇవ్వబోతున్నారా? లేక ఇవన్నీ సోషల్ మీడియా సృష్టించిన గాసిప్సేనా? అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment