విజయ్ – రష్మిక మందన్న వెడ్డింగ్ కార్డ్ లీక్‌

విజయ్ దేవరకొండ & రష్మిక మందన్నా వివాహం!

టాలీవుడ్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నేషనల్ క్రష్‌గా పేరుగాంచిన ర‌ష్మిక మంద‌న్న‌ పెళ్లి ద‌గ్గ‌ర‌ప‌డుతోంది. పెళ్లి బిజీలో ఇరు కుటుంబాలు బిజీగా ఉండ‌గా, ఈ ఇద్ద‌రు స్టార్ క‌పుల్స్ ఎయిర్‌పోర్ట్ విజువల్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. తాజాగా విజ‌య్‌-ర‌ష్మికల వెడ్డింగ్ కార్డ్ లీక్ అయ్యింది. అది సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

ఆ కార్డులో వివ‌రాల ప్ర‌కారం.. ఈనెల 26న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కట‌వ్వ‌నున్నారు. రాజస్థాన్‌లోని ‘సిటీ ఆఫ్ లేక్స్’గా ప్రసిద్ధి చెందిన ఉద‌య్‌పూర్‌లో అత్యంత సన్నిహితుల మధ్య వివాహ వేడుక జరగనుందని సమాచారం. అలాగే, మార్చి 4న హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణ హోట‌ల్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసిన‌ట్టుగా ఆ వెడ్డింగ్ కార్డులో తెలిపారు. తాను- ర‌ష్మిక త‌మ వివాహానికి ఆహ్వానిస్తున్నామ‌ని కార్డులో పేర్కొన్నారు విజ‌య్‌.

ఈ కార్యక్రమాలకు సినీ, రాజకీయ, సామాజిక ప్రముఖులను వ్యక్తిగతంగా ఆహ్వానిస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవ‌ల విజ‌య్ దేవ‌ర‌కొండ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని కూడా క‌లిశారు. విజ‌య్ – ర‌ష్మిక‌ల వివాహ రిసెప్ష‌న్ వేడుక‌కు సినీ తార‌ల‌తో పాటు రాజ‌కీయ ప్ర‌ముఖులు కూడా హాజ‌రు కానున్న‌ట్లుగా తెలుస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment