నిశ్చితార్థం అయిపోయింది.. నెక్ట్స్ పెళ్లే..!!

నిశ్చితార్థం అయిపోయింది.. నెక్ట్స్ పెళ్లే..!!

టాలీవుడ్ లవ్‌బర్డ్స్ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా తమ రిలేషన్‌షిప్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లారు. ఎన్నాళ్లుగానో ప్రేమలో ఉన్న ఈ జంట ఇప్పుడు జీవితాంతం ఒక్కటయ్యే నిర్ణయం తీసుకుంది. ఇటీవల విజయ్ ఇంట్లోనే, కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి నిశ్చితార్థం సింపుల్‌గా జరగ్గా, వచ్చే ఏడాది ఫిబ్రవరి చివర్లో పెళ్లి జరగనుందని సమాచారం.

తాజాగా విజయ్ దేవరకొండ కూడా పెళ్లిపై స్పందించాడు. “నాకు ఇప్పుడు పెళ్లీడు వచ్చేసింది.. తోడు కావాలని అనిపిస్తోంది. సరైన సమయం చూసుకుని త్వరలోనే పెళ్లి చేసుకుంటాను” అని కొద్ది నెలల క్రితం చెప్పిన మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయి.

విజయ్ – రష్మికల బంధం గీతగోవిందం సమయంలో మొదలై, డియర్ కామ్రేడ్ సమయంలో మరింత ద‌గ్గ‌ర‌య్యాయి. అప్పటి నుంచి వీరిద్దరూ దాగుడుమూతలాడుతూ తమ ప్రేమను బయటపెట్టడం ప్రారంభించారు. ఒకే ఇంట్లో వేరువేరుగా ఫొటోలు షేర్ చేయడం, ఒకే రిసార్ట్‌లో తీసిన చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, తరవాత కలిసి డిన్నర్ డేట్స్‌కి వెళ్ళడం ఇలా దశలవారీగా తమ రిలేషన్‌ని పబ్లిక్‌లోకి తీసుకువచ్చారు.

ఇప్పుడు ఆ ప్రేమకథ ఓ కొత్త మలుపు తిరిగి పెళ్లి బంధంతో ముగియబోతోంది. త్వరలోనే నేషనల్ క్రష్‌గా పేరుపొందిన రష్మిక, దేవరకొండ కుటుంబంలో కొత్త కోడలిగా అడుగుపెట్టనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment