టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు శరవేగంగా ముందుకు సాగుతున్నాడు. వరుసగా సినిమాలను లైన్‌లో పెట్టుకుంటూ, బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్‌లను ఫైనల్ చేస్తున్నాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) దర్శకత్వంలో ‘కింగ్‌డమ్(Kingdom)’ సినిమా చేస్తున్న విజయ్, ఆ ప్రాజెక్ట్ పూర్తి కాకుండానే మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాలీవుడ్‌లో టాక్.
ఇంద్రగంటి కథకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా?
విజయ్ ఇప్పటికే ‘రాహుల్ సంకృత్యాన్ (Rahul Sankrityan)’ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్‌కు కమిట్ అయ్యాడు. అలాగే ‘రాజావారు రాణీవారు’ ఫేమ్ రవికిరణ్ కోలా (Ravikiran Kola) దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయనున్నాడని సమాచారం. ఇప్పుడు విజయ్ మరో టాలెంటెడ్ డైరెక్టర్‌తో సినిమా చేయనున్నాడనే వార్తలు ఫిల్మ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ‘అష్టాచెమ్మా’, ‘సమ్మోహనం’, ‘జెంటిల్మెన్’ వంటి హిట్ సినిమాలతో తనదైన ముద్ర వేసిన ఇంద్రగంటి .. విజయ్ కోసం ఓ ఆసక్తికరమైన కథ సిద్ధం చేశారట.
ముందుగా ఏ ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేస్తాడు?
ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ (Indraganti Mohana Krishna) టీమ్ ఈ కథకు పూర్తిస్థాయిలో బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తోంది. అయితే విజయ్ ముందుగా ‘కింగ్‌డమ్’ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత రాహుల్ సంకృత్యాన్ ప్రాజెక్ట్‌పై ఫోకస్ చేస్తాడని, ఆ తర్వాతే ఇంద్రగంటి మోహనకృష్ణ లేదా రవికిరణ్ కోలా ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నాడని తెలుస్తోంది.