విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు వైరల్!

విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు వైరల్!

నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఏ వేదిక ఎక్కినా ఏదో ఒక ఆసక్తికర వ్యాఖ్య చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తారు. తాజాగా తన రూమర్డ్ ప్రియురాలు రష్మిక మందన్నా (Rashmika Mandanna) నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend) సినిమా విజయోత్సవ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఈ సినిమా చూసిన తర్వాత తన మనసు మారిపోయిందని విజయ్ తెలిపారు.

“జీవితంలో చావు, పుట్టుక మన చేతుల్లో ఉండవు. కాబట్టి, ఉన్నంత కాలం వీలైనంత వరకు జీవితాన్ని ఎంజాయ్ చేయాలి” అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ఇంతకీ విజయ్ చెప్పిన ఎంజాయ్‌మెంట్ అంటే ఏమై ఉంటుంది అని నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలు డేటింగ్‌లో ఉన్నారనే విషయం బహిరంగ రహస్యమే. అంతేకాకుండా, ఇటీవల వీరిద్దరూ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారనే వార్తలు కూడా వినిపించాయి. ఈ జంట వీలు కుదిరినప్పుడల్లా విదేశీ పర్యటనలకు వెళ్తున్నా, ఆ విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. విజయ్ దేవరకొండ చేసిన తాజా వ్యాఖ్యలు బహుశా రష్మికతో కలిసి చేస్తున్న అలాంటి ఎంజాయ్‌మెంట్ గురించి కావచ్చని అభిమానులు మరియు నెటిజన్లు ఊహాగానాలు చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment