విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తన కింగ్ డమ్ (King Dom) సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతున్న సమయంలోనే, మరో భారీ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టాడు. దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ (Rahul Sankrityan) దర్శకత్వంలో ఒక భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు విజయ్. ఇప్పటికే ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయి.
మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా 1854 నుంచి 1878 కాలంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. జులై రెండో వారం నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం హైదరాబాద్ శివారు ప్రాంతంలో రూ.2 కోట్లతో భారీ సెట్ (Huge Set) ఏర్పాటు చేశారని సమాచారం.
సెట్ విశేషాలు, నటీనటులు
రూ.2 కోట్లతో వేసిన ఈ సెట్‌లోనే సినిమాలోని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సెట్ పూర్తిగా అప్పటి కాలానికి అనుగుణంగా తీర్చిదిద్దారని, ఇప్పటివరకు ఇలాంటి సెట్‌ను ఎవరూ వేయలేదనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ యోధుడిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.
విజయ్ సరసన రష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించనుందని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇది ఒక భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ కోర మీసాలతో కనిపించిన లుక్ అభిమానులను కట్టిపడేసింది. ఆ లుక్ రాహుల్ సాంకృత్యన్ సినిమా కోసమే అని తెలుస్తోంది.
ఈ సినిమా కోసం అన్ని భాషల నుంచి ప్రముఖ నటులను ఎంపిక చేస్తున్నారు. కీరవాణి (Keeravani) సంగీతం అందించనున్నారని కూడా ప్రచారం జరుగుతోంది.
విజయ్ దేవరకొండ త్వరలోనే ‘కింగ్ డమ్’ ప్రమోషన్లలో పాల్గొనాల్సి ఉంది. మరి రెండు సినిమాల షెడ్యూల్స్‌ను ఎలా బ్యాలెన్స్ చేస్తాడు, లేదా షూటింగ్‌పైనే దృష్టి సారిస్తాడా అనేది చూడాలి.