కీలకమైన సమావేశంలో ఉన్నత స్థాయి అధికారి సెల్‌ఫోన్‌లో పేకాట ఆడుతూ కాలక్షేపం చేసిన ఘటన వైరల్‌గా మారింది. అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మలోలా హాజరయ్యారు. ఎస్సీ వర్గీకరణపై కీలక సమావేశం జరుగుతుండగా, డీఆర్వో మలోలా తన సెల్‌ఫోన్‌లో రమ్మీ ఆడుతూ కాలక్షేపం చేశాడు.
పలు సంఘాల నేతలు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చినా పట్టించుకోనట్లుగా వ్యవహరించాడు. డీఆర్వో మలోలా ఆన్‌లైన్‌లో పేకాట ఆడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి డీఆర్వో తీరుపై ఉన్నతాధికారులు, ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.