న్యూఢిల్లీ: భారత (India’s) ఉపరాష్ట్రపతి (Vice President) జగదీప్ ధన్‌ఖర్ (Jagdeep Dhankhar) (74) తన పదవికి రాజీనామా (Resignation) చేశారు. అనారోగ్య కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. 2022 జూలై 16న ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన ధన్‌ఖడ్, తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు.
రాజీనామా లేఖలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi)కి మరియు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(ఎ) ప్రకారం ఈ రాజీనామా తక్షణమే అమలులోకి వస్తుందని ఉపరాష్ట్రపతి కార్యాలయం విడుదల చేసిన లేఖలోధన్‌ఖడ్ స్పష్టం చేశారు. వైద్యుల సలహా మేరకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
జగదీప్ ధన్‌ఖడ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం:
జననం: 1951 మే 18న రాజస్థాన్ రాష్ట్రంలోని ఝున్‌ఝును (Jhunjhunu) జిల్లా, కితానా (Kithana) గ్రామంలో జన్మించారు.
విద్య: చిత్తోర్‌గఢ్ (Chittorgarh)లోని సైనిక్ స్కూల్ (Sainik School)లో పాఠశాల విద్యను, రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుండి భౌతికశాస్త్రంలో బీ.ఎస్సీ (ఆనర్స్) మరియు ఎల్.ఎల్.బి. పట్టాలను పొందారు.
వృత్తి: సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు.
జననం: 1951 మే 18న జన్మించారు.
గవర్నర్‌గా: 2019–2022 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
పార్లమెంటు సభ్యుడిగా: 1989–1991 కాలంలో లోక్‌సభ సభ్యుడిడి పని చేశారు.
కేంద్ర మంత్రిగా: 1990-91 మధ్య కేంద్ర మంత్రిగా బాధ్యత నిర్వర్తించారు.
ఉపరాష్ట్రపతిగా: 2022లో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించి, ఆగస్టు 11న ప్రమాణ స్వీకారం చేశారు.