ఎయిమ్స్‌లో చేరిన ఉపరాష్ట్రపతి

ఛాతి నొప్పితో ఎయిమ్స్‌లో చేరిన ఉపరాష్ట్రపతి

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖ‌డ్ ఆరోగ్యం విషయంలో ఆకస్మిక పరిణామం చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి ఆయన ఛాతి నొప్పితో బాధపడినట్లు సమాచారం. దీంతో వెంటనే ఆయన్ను తెల్లవారుజామున 2 గంటలకు న్యూఢిల్లీ లోని ఎయిమ్స్ (AIIMS) ఆసుపత్రికి తరలించారు. ఎయిమ్స్ కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ నేతృత్వంలో జగదీప్ ధన్‌ఖ‌డ్‌కు ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. దేశవ్యాప్తంగా ఆయన ఆరోగ్యంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment