రికార్డులు తిరగరాసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’

రికార్డులు తిరగరాసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’

Summarize with AI

విక్టరీ వెంకటేశ్ (Venkatesh) హీరోగా స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా విడుద‌లైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vastunnam) సినిమా తెలుగు సినీ పరిశ్రమలో రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు థియేటర్లలో నవ్వుల జల్లు కురిపిస్తూనే, బాక్సాఫీసు (Box office) వద్ద భారీగా కాసులు (Collections) వర్షం కురిపిస్తోంది.

రిలీజ్ అయిన 13వ రోజు నాటికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ సినిమా రూ. 6.77 కోట్ల షేర్‌ను వసూలు చేసింది. ప్రభాస్-రాజమౌళి కాంబోలో వచ్చిన బాహుబలి-2 సినిమా 13వ రోజు వసూళ్లను కూడా ఈ సినిమా దాటేసిందని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఇప్పటి వరకు వసూళ్లు సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమా రూ. 276 కోట్ల భారీ వసూళ్లు సాధించి, మరోసారి విక్ట‌రీ వెంకటేశ్ ఫ్యాన్స్ గర్వపడేలా చేసింది. ఈ స్థాయి విజయంతో ‘సంక్రాంతికి వస్తున్నాం’ మరో రికార్డు సినిమాగా నిలిచింది.

Join WhatsApp

Join Now

Leave a Comment