స‌న్‌రైజ‌ర్స్‌ను చిత్తు చేసిన కేకేఆర్

స‌న్‌రైజ‌ర్స్‌ను చిత్తు చేసిన కేకేఆర్

IPL-18లో ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens) వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) 80 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ (Sunrisers) ను మట్టికరిపించింది. 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్‌రైజర్స్ 16.4 ఓవర్లలో కేవలం 120 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెన‌ర్లు, టాప్‌, మిడిలాడ‌ర్లు అంతా కేకేఆర్ బౌలింగ్‌కు చేతులెత్తేశారు. క్లాసిన్‌, మెండిస్ మిన‌హా ఎవ్వ‌రూ క్రీజ్‌లో ఎక్కువ సేపు నిల‌బ‌డ‌లేక‌పోయారు. వ‌చ్చిన‌వారు వ‌చ్చిన‌ట్లుగా కోల్‌క‌తా బౌల‌ర్ల‌కు వికెట్లు స‌మ‌ర్పించేశారు.

కోల్‌కతా బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. వైభవ్ అరోరా 3 వికెట్లు పడగొట్టగా, వరుణ్ చక్రవర్తి, ఆండ్రే రస్సెల్ తలో 2 వికెట్లు సాధించారు. హర్షిత్ రానా, సునిల్ నరైన్ ఒక్కో వికెట్ తీశారు. బౌలర్ల సమష్టి కృషితో కోల్‌కతా బలమైన విజయాన్ని నమోదు చేసుకుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment