‘ఆ బొద్దింక పేరు వెంట్రుకా..?’ – హోంమంత్రి వివ‌ర‌ణ‌పై సెటైర్లు

'ఆ బొద్దింక పేరు వెంట్రుకా..?' - హోంమంత్రి వివ‌ర‌ణ‌పై సెటైర్లు

హోంమంత్రి వంగ‌ల‌పూడి అనిత (Vangalapudi Anitha) గ‌త రెండ్రోజులుగా సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నారు. ఎక్స్‌, ఇన్‌స్టా వంటి ప్లాట్‌ఫామ్స్‌లో హోంమంత్రి భోజ‌నం (Home Minister Meal), వివ‌ర‌ణ వీడియోలే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. అన‌కాప‌ల్లి జిల్లా (Anakapalli District) నక్కపల్లి (Nakkapalli) బాలికల గురుకుల హాస్టల్‌ (Girls’ Gurukula Hostel)ను సందర్శించి స‌మ‌యంలో విద్యార్థుల‌తో క‌లిసి అక్క‌డే హోంమంత్రి భోజ‌నం చేశారు. హోంమంత్రి భోజ‌నంలో బొద్దింక (Cockroach) వ‌చ్చింది. దాన్ని ఆమె చేత్తో ప‌ట్టుకొని నాకు వ‌డ్డించిన అన్నంలోనే ఇలా వ‌చ్చిందంటూ ప్ర‌శ్నించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఆ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది.

ఆ వీడియో హోంమంత్రి అనిత ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో వివ‌ర‌ణ ఇచ్చుకునేంత పెద్ద అంశంగా మారింది బొద్దింక ఎపిసోడ్‌. అయితే ప్రెస్‌మీట్‌లో హోంమంత్రి ప‌లు మీడియా, యూట్యూబ్ ఛాన‌ళ్ల థంబ్‌నైల్స్ చూపిస్తూ వీడేమైనా వ‌చ్చి చూశాడా అంటూ అస‌హ‌నాన్ని వెళ్ల‌గ‌క్కారు. ఆ త‌రువాత చిన్న పామునైనా పెద్ద క‌ర్ర‌తో కొట్టాల‌ని ఓ సామెను ఉటంకిస్తూ.. త‌నకు వ‌డ్డించిన భోజ‌నంలో వ‌చ్చింది బొద్దింక కాదు, చిన్న వెంట్రుక క‌నిపిస్తే తీసి పారేశాన‌ని చెప్పుకొచ్చారు.

అయితే వీడియోలో బొద్దింక అంత క్లియ‌ర్‌గా క‌నిపిస్తున్నా.. వెంట్రుక (Hair) అని ఎలా అబ‌ద్ధం చెప్ప‌గ‌లుగుతున్నారు మేడం అంటూ సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. హోంమంత్రి చేత్తో ప‌ట్టుకున్న బొద్దింక పేరు వెంట్రుకా..? అని సైట‌ర్లు పేలుస్తున్నారు. క‌వ‌ర్ డ్రైవ్ స‌రిగ్గా లేద‌ని కొంద‌రు కామెంట్లు చేస్తుండ‌గా, వెంట్రుక బొద్దింక సైజ్‌లో ఉంటుందా..? అని మ‌రి కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. బొద్దింక వీడియో రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించ‌గా, హోంమంత్రి వివ‌ర‌ణ వీడియో కూడా అంతే స్థాయిలో ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. అంత‌టితో వ‌దిలేస్తే అయిపోయేది.. అన‌వ‌స‌రంగా వెంట్రుక అంటూ మ‌రోసారి హోంమంత్రి దొరికిపోయారంటూ తెలుగుదేశం పార్టీ సానుభూతి ప‌రులు సైతం సోష‌ల్ మీడియాలో కామెంట్లు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Join WhatsApp

Join Now

Leave a Comment