జగన్‌తో వంశీ భేటీ.. మార‌నున్న గ‌న్న‌వ‌రం రాజ‌కీయం..!

జగన్‌ను కలిసిన వంశీ.. యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి..!

నాలుగున్న‌ర నెల‌ల జైలు జీవితం (Jail Life) నుంచి వైసీపీ నేత (YSRCP Leader) వ‌ల్ల‌భ‌నేని వంశీ (Vallabhaneni Vamsi) విముక్తి పొందారు. త‌న‌పై న‌మోదైన 11 కేసుల్లోనూ బెయిల్ (Bail) పొందిన వంశీ.. ప్ర‌భుత్వ‌ బెయిల్ ర‌ద్దు పిటీష‌న్ల‌లోనూ సుప్రీం కోర్టు (Supreme Court)లో ఊర‌ట పొంది నిన్న విడుద‌ల‌య్యారు. విడుద‌ల అనంత‌రం ఇవాళ వైసీపీ అధినేత (YSRCP Chief) వైఎస్ జ‌గ‌న్‌ (YS Jagan)తో మాజీ ఎమ్మెల్యే వంశీ దంప‌తులు (Vamsi Couple) భేటీ అయ్యారు. 140 రోజుల నిర్బంధం తర్వాత ఇటీవల జైలు నుంచి విడుదలైన వంశీ, తన కష్టకాలంలో అండగా నిలిచిన జగన్‌కు కృతజ్ఞతలు (Thanks) తెలిపారు. ఈ సందర్భంగా జగన్, వంశీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న‌ట్లు స‌మాచారం.

వంశీపై చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Government) 11 అక్రమ కేసులు నమోదు చేసి వేధించిందని, రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఈ కేసులు బనాయించారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఫిబ్రవరి 13న హైదరాబాద్‌లో వంశీని అరెస్టు చేసిన పోలీసులు, గన్నవరం టీడీపీ కార్యాలయంపై 2023లో జరిగిన దాడి, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు, ఫేక్ హౌస్ పట్టాల కేసు వంటి వివిధ ఆరోపణలతో ఆయనను జైల్లోనే 140 రోజులుగా నిర్బంధించారు. న్యాయస్థానం వంశీకి బెయిల్ మంజూరు చేసినప్పటికీ, కొత్త కేసులు పెట్టి ఆయన విడుదలను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నినట్లు వైసీపీ నేత‌లు ఆరోపించారు.

యాక్టివ్ పాలిటిక్స్‌లోకి..
జైలు నుంచి విడుదలైన తర్వాత జగన్‌ను కలిసిన వంశీ, తనపై నమోదైన కేసులను ఎదుర్కొనేందుకు, కష్టకాలంలో తనకు అండ‌గా నిలిచినందుకు జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. వీరిద్ద‌రి మ‌ధ్య గ‌న్న‌వ‌రం రాజ‌కీయాల‌పై చ‌ర్చ జ‌రిగిన‌ట్లుగా స‌మాచారం. వంశీ త‌న నియోజ‌క‌వ‌ర్గంలో మ‌ళ్లీ యాక్టివ్ కానున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వంశీ విడుదల కూటమి ప్రభుత్వానికి రాజకీయంగా సవాలుగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment