వ‌ల్ల‌భ‌నేని వంశీ డిశ్చార్జ్.. ఆస్ప‌త్రి నుంచి నేరుగా..

ఆస్ప‌త్రి నుంచి వంశీ డిశ్చార్జ్..

గన్నవరం (Gannavaram) మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత డిశ్చార్జ్ (Discharged) అయ్యారు. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వంశీని హైకోర్టు ఆదేశాల మేర‌కు చికిత్స నిమిత్తం మూడు రోజుల క్రితం విజయవాడ (Vijayawada)లోని ఆయుష్ హాస్పిటల్‌ (Ayush Hospital)కు జైలు అధికారులు తరలించారు.

వంశీ పలుకేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నా, ఆయన ఆరోగ్య పరిస్థితిపై హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. ఈ నెల 5వ తేదీ (June 5th) నాటికి ఆరోగ్య నివేదికను సీల్ కవర్‌లో సమర్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది. వంశీ తరఫు న్యాయవాదులు మధ్యంతర బెయిల్ (Interim Bail) కోరడంతో హైకోర్టు అనుమతి ఇచ్చింది.

వంశీని గత శుక్రవారం విజయవాడ సెంట్రల్ జైలులో నుంచి ఆయుష్ హాస్పిటల్‌కు పోలీసులు తీసుకెళ్లి చికిత్స అందించారు. వైద్యుల పర్యవేక్షణలో మూడు రోజులు చికిత్స పొందిన ఆయనను ఇవాళ‌ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి వల్లభనేని వంశీని జిల్లా జైలుకు తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం వైసీపీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. పార్టీ నేతలు వంశీ ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సీల్ క‌వ‌ర్ నివేదిక‌పై హైకోర్టు ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికర అంశంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment