వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 10 నుంచి 19 వరకు నిర్వహించనున్న వైకుంఠద్వార దర్శనాల కోసం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబర్ 24న విడుదల చేయనున్నట్టు TTD ఈవో శ్యామలరావు వెల్లడించారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి వైకుంఠద్వార దర్శన ఏర్పాట్లపై సమీక్షించిన అనంతరం ఈ ప్రకటన చేశారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని TTD ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. టికెట్లను పొందడం కోసం భక్తులు TTD అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. వైకుంఠ ఏకాదశి పండుగ రోజులలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకోవడం మంచిది.
వైకుంఠ ఏకాదశి ప్రత్యేక దర్శన టికెట్ కోటాను డిసెంబర్ 24వ తేదీ విడుదల చేస్తారు. వైకుంఠ ద్వార దర్శనాలు వచ్చే ఏడాది 2025 జనవరి 10-19 వరకు జరగనున్నాయి. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ వెల రూ.300 అని టీటీడీ తెలిపింది.