IPL13వ మ్యాచ్‌లో భాగంగా నేడు గౌహతిలోని బర్సపారా స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్(RR), ముంబై ఇండియన్స్(MI)తో తలపడనుంది. ఈ సీజన్లో ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ విజయం సాధించింది రాజస్థాన్. మరోవైపు, ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు తొలి మ్యాచ్‌లో గెలిచింది. రెండో మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ఇక ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ సాధించి జట్టులోకి రావడం ముంబైకి కలిసొచ్చే అంశం. ఈరోజు జరగబోయే పోరు కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే.. నేడు తలపడే ఇరు జట్ల మధ్య కొన్ని ఆసక్తికర అంశాలు ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైనది వైభవ్ సూర్యవంశీ vs జస్ప్రీత్ బుమ్రా కాంబినేషన్. తన వైభవ్ తన కెరీర్లో తొలి సారి బుమ్రాను ఎదుర్కోబోతున్నాడు.
గత ఏడాది కాలంగా సంచలన బ్యాటింగ్‌తో అందరినీ అబ్బురపరుస్తున్నాడు యంగ్ స్టార్ వైభవ్ సూర్యవంశీ. ఈ 15 ఏళ్ల కుర్రాడు ఈ సీజన్లోనూ మెరుపు ఇన్సింగ్స్ ఆడాడు. కానీ.. నేడు వైభవ్‌కు అసలైన సవాల్ ఎదుకు రాకనుంది. ప్రపంచం మెచ్చినబౌలర్ జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కోబోతున్నాడు. బుమ్రా వేసే పదునైన యార్కర్లు, స్లోయర్ బంతులను ఈ యువ సంచలనం ఎలా తట్టుకుంటాడనేది అందరినీ ఊరిస్తోంది. మరోవైపు.. రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు హార్దిక్ పాండ్యా అంటే ఒక రకమైన భయం ఉంది. గణాంకాల ప్రకారం.. ఐపీఎల్లో హార్దిక్ వేసిన 11 బంతుల్లో జైస్వాల్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఒకసారి అవుట్ అయ్యాడు. అతని స్ట్రైక్ రేట్ కేవలం 36.36 మాత్రమే ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో మళ్లీ హార్దిక్ బౌలింగ్‌లో జైస్వాల్ ఎలా ఆడతాడో చూడాలి.








