---Advertisement---

బంగ్లాదేశ్‌లో మ‌ళ్లీ చెల‌రేగిన‌ దాడులు.. అమెరికా ఆందోళన

బంగ్లాదేశ్‌లో మ‌ళ్లీ చెల‌రేగిన‌ దాడులు.. అమెరికా ఆందోళన
---Advertisement---

బంగ్లాదేశ్‌లో హిందువులతో పాటు ఇతర మైనారిటీలపై దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ దేశంలో తీవ్ర పరిస్థితులు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్‌తో యూఎస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివన్ చర్చలు నిర్వహించారు.

అమెరికా మరియు బంగ్లాదేశ్ మధ్య మానవ హక్కుల రక్షణలో కలసి పనిచేయాలని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో అమెరికా మద్దతు ఇస్తుంద‌ని సలివన్ హామీ ఇచ్చారు.

పరిస్థితులు మరింత ఉద్రిక్తం
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశాన్ని వదిలి వెళ్లిన తర్వాత, హిందువులపై దాడులు తీవ్రమయ్యాయి. ముఖ్యంగా ఇస్కాన్ ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్‌ను అరెస్ట్ చేయడం వల్ల పరిస్థితులు మరింత దిగజారాయి. దీనితో, భారత్ కూడా ఈ విషయంలో మరింత విచారం వ్య‌క్తం చేస్తోంది. భార‌త విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్, విదేశాంగశాఖ కార్యదర్శి మహమ్మద్ జషీమ్ ఉద్దీన్‌లతో సమావేశమయ్యారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment