అమెరికా ఖజానాపై చైనా సైబర్‌ దాడి..!

అమెరికా ఖజానాపై చైనా సైబర్‌ దాడి..!

అగ్ర దేశం అమెరికా ఖజానాపై చైనా సైబర్‌ దాడి చేసినట్లు తాజా సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ దాడి వర్క్‌ స్టేషన్లపై, కీలక ఫైల్స్‌పై జరిపినట్లుగా చెబుతున్నారు. ఈ విషయంలో అమెరికా ట్రెజరీ శాఖ కాంగ్రెస్‌కు లేఖ రాసింది, కానీ, ఈ లేఖ మీడియా చేతికి చేరడంతో అసలు విషయం బయటపడింది.

సైబర్‌ దాడి వివరాలు..
డిసెంబర్‌ నెల మొద‌టి వారం త‌రువాత ఈ సైబర్‌ దాడి జరిగినట్లు తెలుస్తోంది. థర్డ్ పార్టీ సైబర్‌ సెక్యూరిటీ సేవలను అందించే ప్రొవైడర్‌ పాస్‌వర్డ్‌ను హ్యాకర్లు పొందించి, వర్క్‌ స్టేషన్లు, కొన్ని కీలక ఫైల్స్‌లోని సమాచారాన్ని దోచేసారు. ఈ విషయాన్ని ట్రెజరీ శాఖ యూఎస్‌ సైబర్‌ సెక్యూరిటీ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెక్యూరిటీ ఏజెన్సీకి తెలియజేసింది.

సైబర్‌ దాడిపై బియాండ్‌ ట్రస్ట్ సంస్థ స్పందించలేదు. ఇటీవల కాలంలో థర్డ్ పార్టీ సైబర్‌ సెక్యూరిటీ సేవలందించే సంస్థలను లక్ష్యంగా చేసుకుని సైబర్‌ దాడుల సంఖ్య పెరిగిందని నిపుణులు పేర్కొంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment