హార్ముజ్‌లో మైన్-లేయింగ్ బోట్లపై అమెరికా దాడి..

హార్ముజ్‌లో మైన్-లేయింగ్ బోట్లపై అమెరికా దాడి..

ఇరాన్‌పై అమెరికా దాడులు మరింత ఉధృతమవుతున్నాయి. హార్ముజ్ జలసంధిలో 16 ఇరానియన్ మైన్-లేయింగ్ బోట్లను అమెరికా ధ్వంసం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా అమెరికా ప్రభుత్వం విడుదల చేసింది. గత నెల 28 నుంచి ఈ ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరాలో కొరత ఏర్పడింది. ఈ ఉద్రిక్త పరిస్థితులు పశ్చిమాసియాలో మరింత భయపెట్టే స్థాయిలో ఉన్నాయి. ఇరాన్-అమెరికా మధ్య మాటల తూటాలు, హెచ్చరికలు, వార్నింగ్‌లు విపరీతంగా కొనసాగుతున్నాయి.

ఇరాన్ హార్ముజ్ జలసంధిలో చమురు ఎగుమతులను అడ్డుకోవాలని, శత్రువుల కోసం కూడా చమురు రవాణాకు అవకాశం ఇవ్వమని ప్రతిజ్ఞ చేసింది. దీనిపై స్పందిస్తూ అమెరికా లక్ష్యంగా బాంబులతో 16 మైన్-లేయింగ్ బోట్లను ధ్వంసం చేసింది. అయితే జలసంధిలో పేలుడు పదార్థాలు అమర్చినట్లు ఎటువంటి సమాచారం లభించలేదు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో 20 శాతం మాత్రమే చమురు రవాణా అవుతుందని, ఏవైనా ప్రమాదకరమైన పదార్థాలు అమర్చితే మరింత కఠినమైన దాడులు చేస్తామని హెచ్చరించారు. అలాగే అమెరికా రక్షణ కార్యదర్శి హెత్ హెగ్‌సెట్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసి, ఇప్పటి వరకు చూడని స్థాయిలో యుద్ధ చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.

మరోవైపు, లెబనాన్‌లో ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగించాయి. దక్షిణ లెబనాన్‌లో బహుళ దాడులలో ఏడుగురు మరణించగా, ఒకరు రెడ్ క్రాస్ సభ్యుడని లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపారు. ఇరాన్‌లో అమెరికా దళాలు 5,000 కంటే ఎక్కువ లక్ష్యాలను ఛేదించగా, దాదాపు 140 మంది సైనికులు గాయపడ్డారు. వీరిలో ఎక్కువ మంది స్వల్ప గాయాలతో ఉన్నారు. 108 మంది సైనికులు విధుల్లోకి తిరిగి చేరారు. ఈ యుద్ధంలో ఇరాన్‌లో కనీసం 1,230 మంది, లెబనాన్‌లో 480 పైగా, ఇజ్రాయెల్‌లో 12 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment